బీటెక్ అర్హతతో 229 ఇంజినీర్‌ ఉద్యోగాలు.. ఏడాదికి రూ.12.5 లక్షల వరకు జీతం.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది

BEL Bangalore 229 Engineer Posts : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మరో భారీ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా ఇంజినీర్‌ పోస్టులను భర్తీ చేయనుంది.

BEL Engineer Recruitment 2024 :

తాజాగా రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (Bharat Electronics Limited) ఫిక్స్‌డ్‌ టెన్యూర్‌ బేసిస్‌పై ఇంజినీర్ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. ఈ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ ద్వారా 229 ఇంజినీర్‌ ఉద్యోగాలు (యూఆర్‌-99, ఈడబ్ల్యూఎస్‌-20, ఓబీసీ-61, ఎస్సీ-32, ఎస్టీ-17) భర్తీ చేయనుంది. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. బీఈ, బీటెక్‌, బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

డిసెంబర్‌ 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ https://bel-india.in/ చూడొచ్చు. అలాగే.. అప్లయ్‌ చేసుకోవడానికి అప్లికేషన్‌ లింక్ ఇదే. ఇక ఈ పోస్టులకు సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్/ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. త్వరలో రాత పరీక్ష నిర్వహణ తేదీని కూడా వెల్లడించనున్నారు.

ముఖ్యమైన సమాచారం :

  • ఫిక్స్‌డ్‌ టెన్యూర్‌ ఇంజినీర్ పోస్టులు : 229
  • విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
  • అర్హత: బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్ (ఎలక్ట్రానిక్స్/ మెకానికల్/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత ఉండాలి.
  • గరిష్ఠ వయో పరిమితి: 01.11.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.
  • వేతనం: నెలకు రూ.40,000- రూ.1,40,000 వరకు ఉంటుంది. అంటే ఏడాదికి సుమారుగా రూ.12 లక్షల నుంచి రూ.12.5 లక్షల వరకు అందుతుంది.

ఇంకా..

  • ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్/ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • దరఖాస్తు ఫీజు: రూ.400+ జీఎస్టీ (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది).
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి.
  • జాబ్‌ లొకేషన్‌: బెంగళూరు కాంప్లెక్స్, అంబాలా, జోధ్‌పుర్, బటిండా, ముంబయి, వైజాగ్, ఢిల్లీ, ఇందౌర్, ఘజియాబాద్ తదితర ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది.

నోటిఫికేషన్‌

bel-engineer

ముఖ్యమైన తేదీలు:

  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్‌ 10, 2024
  • రాత పరీక్ష నిర్వహణ: పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *