తెలంగాణ వరంగల్ జాబ్ మేళా తో నిరుద్యోగులకు సువర్ణావకాశం

చాలా మంది యువత ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా లో జాబ్ మేళా తో సువర్ణావకాశం.ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం కోసం ఈనెల 18న జాబ్ మేళా నిర్వహించనున్నారు.

నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వాలు ముందుకు వెళుతున్నాయి. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం పలుచోట్ల జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. 

ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు సైతం నిరుద్యోగులకు పలుచోట్ల ఉచిత శిక్షణ అందించిన అనంతరం ఉపాధి కల్పిస్తున్నారు. అదేవిధంగా పలుచోట్ల జాబ్ మేళాలు సైతం నిర్వహిస్తున్నారు. దీంతో ఎంతో మంది నిరుద్యోగ అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగాలు పొందుతున్నారు.  

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఉపాధి కల్పన శాఖ ముందుకు వెళుతుంది. ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం కోసం ఈనెల 18న జాబ్ మేళా నిర్వహించనున్నారు. 

ఈ మేరకు జిల్లా ఉపాధి కల్పన అధికారి సిహెచ్.ఉమారాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. డిగ్రీ, పీజీ, బీటెక్, ఫార్మసీ, ఇంటర్, డిప్లొమా, ఐటిఐ చేసిన అభ్యర్థులు ఇందుకు అర్హులన్నారు. 18 నుంచి 28 సంవత్సరాల వయసు గలవారు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు.  

వరంగల్ ములుగు రోడ్డులోని ఉపాధి కల్పన కార్యాలయంలో ఈనెల 18న జాబ్ మేళా ఉంటుందన్నారు. అభ్యర్థులు తమ విద్య అర్హత సర్టిఫికెట్లు, పాస్ ఫోటోలు, ఆధార్ కార్డు, తీసుకొని రావాలన్నారు.  

నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వాలు ముందుకు వెళుతున్నాయి. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం పలుచోట్ల జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. 

ఉదయం 10 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందన్నారు. మరిన్ని వివరాలకు 70931 68464 నెంబర్ ను సంప్రదించాలన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.  

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *