గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలను ప్రారంభించింది. రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలలతో పాటు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎంతో మంది విద్యార్థులు ఉచితంగా విద్యను అభ్యసిస్తున్నారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శ పాఠశాలలను ప్రారంభించింది. రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలలతో పాటు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎంతో మంది విద్యార్థులు ఉచితంగా విద్యను అభ్యసిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న వారికి విద్యాసంస్థలు వరంగా మారాయి.కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నారు.
బోధన రంగంలో ఆసక్తి ఉన్నవారికి ఆదర్శ పాఠశాల ఒక శుభవార్తను అందించింది.పాఠశాలలో ఖాళీగా ఉన్న తాత్కాలిక ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆహ్వానం పలుకుతుంది. జనగామ జిల్లా నర్మేట మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో తాత్కాలిక ప్రతిపాదికన ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.ఈ మేరకు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ పుష్ప కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. తాత్కాలిక ప్రాతిపాదికన కెమిస్ట్రీ, బాటనీకి గాను బీఈడీలో తస్సమాన ట్రైనింగ్, సంబంధిత సబ్జెక్టులో అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.