RRC SER : సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో 1785 అప్రెంటిస్‌ ఖాళీలు.. నోటిఫికేషన్‌ విడుదల

South Eastern Railway Apprentice Recruitment 2024 : ఆర్‌ఆర్‌సీ ఎస్‌ఈఆర్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మొత్తం 1785 ఖాళీలను భర్తీ చేయనుంది.

South Eastern Railway Apprentice Recruitment 2024 : పశ్చిమ్‌ బెంగాల్‌ రాష్ట్రం కోల్‌కతాలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ – సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే (RRC SER Kolkata).. అప్రెంటిస్‌ (apprenticeship) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎస్‌ఈఆర్‌ పరిధిలోని డివిజన్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 1,785 అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేస్తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైన అభ్యర్థులు డిసెంబర్‌ 27వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. మెట్రిక్యులేషన్‌, ఐటీఐ మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ చూడొచ్చు. అలాగే.. అప్లికేషన్‌ లింక్‌ ఇదే.

అప్రెంటిస్‌ ఖాళీలు భర్తీ చేయనున్న ఆర్‌ఆర్‌సీ వర్క్‌షాప్‌లు ఇవే: ఖరగ్‌పూర్ వర్క్‌షాప్, సిగ్నల్ అండ్‌ టెలికాం (వర్క్‌షాప్)(ఖరగ్‌పూర్), ట్రాక్ మెషిన్ వర్క్‌షాప్ (ఖరగ్‌పూర్), ఎస్‌ఎస్‌ఈ (వర్క్స్)/ ఇంజినీరింగ్ (ఖరగ్‌పూర్), క్యారేజ్ అండ్‌ వ్యాగన్ డిపో (ఖరగ్‌పూర్), డీజిల్ లోకో షెడ్ (ఖరగ్‌పూర్), సీనియర్‌ డీఈఈ (జి) (ఖరగ్‌పూర్), టీఆర్‌డీ డిపో/ ఎలక్ట్రికల్ (ఖరగ్‌పూర్), ఈఎంయూ షెడ్/ ఎలక్ట్రికల్ (టీపీకేఆర్‌), ఎలక్ట్రిక్ లోకో షెడ్ (సంత్రగచి), సీనియర్‌ డీఈఈ (జి)(చక్రధర్‌పూర్), ఎలక్ట్రిక్ ట్రాక్షన్ డిపో (చక్రధర్‌పూర్), క్యారేజ్ అండ్‌ వ్యాగన్ డిపో (చక్రధరపూర్), ఎలక్ట్రిక్ లోకో షెడ్ (టాటా), ఇంజినీరింగ్ వర్క్‌షాప్ (సిని), ట్రాక్ మెషిన్ వర్క్‌షాప్ (సిని), ఎస్‌ఎస్‌ఈ (వర్క్స్)/ ఇంజినీరింగ్ (చక్రధర్‌పూర్), ఎలక్ట్రిక్ లోకో షెడ్ (బండాముండా), డీజిల్ లోకో షెడ్ (బండాముండా), సీనియర్‌ డీఈఈ (జి)(ఆద్రా), క్యారేజ్ అండ్‌ వ్యాగన్ డిపో (ఆద్రా), డీజిల్ లోకో షెడ్ (బీకేఎస్‌సీ), టీఆర్‌డీ డిపో/ఎలక్ట్రికల్ (ఆద్రా), ఎలక్ట్రిక్ లోకో షెడ్ (బీకేఎస్‌సీ), ఎలక్ట్రిక్ లోకో షెడ్ (ఆర్‌వోయూ), ఎస్‌ఎస్‌ఈ (వర్క్స్)/ ఇంజినీరింగ్ (ఆద్రా), క్యారేజ్ అండ్‌ వ్యాగన్ డిపో (రాంచీ), సీనియర్‌ డీఈఈ (జి) (రాంచీ), టీఆర్‌డీ డిపో/ ఎలక్ట్రికల్(రాంచీ), ఎస్‌ఎస్‌ఈ (వర్క్స్)/ ఇంజినీరింగ్ (రాంచీ) వర్క్‌షాపుల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఇతర ముఖ్యమైన సమాచారం:మొత్తం యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు : 1,785అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.ట్రేడ్‌లు: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, మెకానిక్ డీజిల్, ట్రిమ్మర్, ఎంఎంటీఎం, ఫోర్జర్ అండ్‌ హీట్ ట్రీటర్, రిఫ్రిజిరేటర్ అండ్‌ ఏసీ మెకానిక్, లైన్‌మ్యాన్ తదితర ట్రేడుల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.వయోపరిమితి: 01.01.2025 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్‌, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి

నోటిఫికేషన్‌

rrc-ser-appre

ముఖ్యమైన తేదీలు :ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేది: నవంబర్‌ 28, 2024ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: డిసెంబర్‌ 27, 2024.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *