Hyderabad : 10th Class పాసైతే చాలు.. హైదరాబాద్‌లో స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌.. తెలంగాణ యువత కోసమే.. పూర్తి వివరాలివే!

Indian Army Recruitment 2024 : సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనుకునే యువతకు అద్భుతం అవకాశం. త్వరలో తెలంగాణలో అగ్నివీర్‌ రిక్రూట్ మెంట్ ర్యాలీ జరగనుంది. తెలంగాణలోని 33 జిల్లాల ఆభ్యర్థులను అగ్నివీరులుగా చేర్చుకొవడానికి ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనుంది.

ప్రధానాంశాలు:

  • అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌ హైదరాబాద్‌ 2024
  • డిసెంబర్‌ 8 నుంచి 16 వరకు ర్యాలీ నిర్వహణ
  • గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం వేదిక

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి

Hyderabad Army Recruitment Rally 2024 : ఇండియన్ ఆర్మీలో చేరడానికి యువతకు గొప్ప అవకాశం కల్పిస్తోంది ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డు. హైదరాబాద్ (Hyderabad)లో అగ్నివీర్‌ రిక్రూట్మెంట్ ర్యాలీని ఇండియన్ ఆర్మీ త్వరలోనే నిర్వహించనుంది. ఇందుకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్ స్టేడియం (GMC Balayogi Stadium) వేదిక కానుంది. దానికి సంబంధించిన ఆర్హత, ముఖ్య తేదీలు, పూర్తి వివరాలను పరిశీలిస్తే.. డిసెంబర్ 8వ తేదీ నుంచి 16 వరకు అగ్నివీర్‌ల రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని జీఎంసీ బాల యోగి అథ్లెటిక్ స్టేడియంలో ఈ ర్యాలీ నిర్వహిచనున్నారు. తెలంగాణలో అగ్నివీరులుగా చేర్చుకొవడానికి ఇండియన్ ఆర్మీ.. ఈ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తోంది.

దాదాపు వారం రోజులు ఈ ర్యాలీని నిర్వహించనున్నారు. అలాగే గతంలో ఎంపికలు నిర్వహించిన మిలటరీ పోలీసు అభ్యర్థులు ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీనాటి నోటిఫికేషన్‌ ప్రకారం విద్యార్హత, స్థానికత, కుల ధ్రువీకరణ, ఈబీసీ తదితర డాక్యుమెంట్లు తీసుకురావాలన్నారు. మిలటరీ పోలీసు అభ్యర్థులు తమిళనాడు, తెలంగాణ, ఏపీ, పుదుచ్చేరి నుంచి తెలంగాణలోని 33 జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్థులను సైన్యంలో అగ్నివీరులుగా చేర్చుకోనున్నారు, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, జోగుళాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కుమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, మంచిర్యాల, మేడ్చల్-మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన అభ్యర్థులు రావొచ్చు. అలాగే.. రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల అభ్యర్థులు కూడా రావొచ్చు.

ఇక.. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్, స్టోర్ కీపర్ ఉద్యోగాలకు 10వ తరగతి చదివిన వారు అర్హులు. అగ్నివీర్ ట్రేడ్స్ మెన్‌కు 8వ తరగతి ఉత్తర్ణత ఉంటే చాలు. ఈ కేటగిరీలకు హైదరాబాద్‌లో ర్యాలీ నిర్వహిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరికి చెందిన మహిళా మిలిటరీ పోలీస్ అభ్యర్థులు.. ఫిబ్రవరి 12వ తేదీ నాటి ర్యాలీ నోటిఫికేషన్ ప్రకారం.. ర్యాలీ సైట్‌కి అన్ని డాక్యుమెంట్‌లను తీసుకురావాలని అధికారులు సూచించారు.

ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఎవరైనా అగ్నివీర్ ఉద్యోగాలు ఇప్పస్తామని చెబితే నమ్మవద్దని స్పష్టం చేశారు. మోసపూరిత ట్వీట్‌లు, మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏదైనా సందేహాలు ఉంటే.. రిక్రూట్‌మెంట్ కార్యాలయం ఫోన్ 040-27740059, 27740205 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఎవరైనా మోసాలకు పాల్పడితే.. ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *