ఎంతోమంది విద్యార్థులు వారు చదివిన చదువుకు తగిన ఉద్యోగాల కోసం, కొలువుల కోసమే చదివే మరికొందరు విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే తపనతో మరి కొందరి ప్రయత్నాలు ఫలించనున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తున్నారు.
విద్యార్థులంతా డిగ్రీలు పట్టుకొని ఎంతో కాలం అయినప్పటికి కొందరికి ఉద్యోగాలు లభించగా చాలామంది ఇప్పటికీ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఎంతోమంది యువతీ యువకులు వారు కలగన్న కొలువులను దక్కించుకునే ప్రయత్నాల్లోనే ఉన్నారు. అటువంటి వారికోసం రేవంత్ ప్రభుత్వం కొలువుల జాతరనే జరిపే ప్రయత్నాలు చేస్తున్నారు.
అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. అంతేకాకుండా గతంలోని కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను కూడా భర్తీ చేయనుంది రేవంత్ సర్కార్. ఇలా ప్రారంభం కాగా, ఇప్పటికే 50 వేల కొలువులు భర్తీ అయ్యాయని రేవంత్ ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే, పలు శాఖల్లో కొలువుల భర్తీ జరుగుతుండగా మరిన్ని కొలువులకు కూడా నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రలు తెలుపుతున్నారు. దీంతో విద్యార్థులు వారి సన్నద్ధతను మరింత వేగం చేస్తున్నారు.1
వివిధ శాఖల్లో జాబ్ నోటిఫికేషన్లు..2
వైద్య ఆరోగ్య శాఖలో కొలువుల భర్తీ..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఏడాదికాలంలో జరిపిన అభివృద్ధి పనులు, చేపట్టిన పథకాలు, చేసిన హామీలు, ప్రకటించిన ఉద్యోగాల భర్తీని గుర్తుచేసుకున్నారు. సోమవారం ఎన్టీఆర్ మర్గ్‌లోని హెచ్ఎండీఏ గ్రౌండ్‌లో ప్రజాపాలన సభను నిర్వహించగా అక్కడికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఏడిది పాలనను గుర్తు చేసుకుంటూ కీలక ప్రకటనలు చేశారు.
అందులోని భాగమే వైద్య ఆరోగ్య శాఖల్లో ఉద్యోగాల భర్తీ కూడా.. వివిధ శాఖల్లో కొలువుల భర్తీకి గురించి వివరిస్తూ మొదట వైద్య శాఖలో భర్తీ చేసేందుకు ప్రకటించాల్సిన నోటిఫికేషన్ గురించి తెలిపారు. ఈ శాఖలో దృష్టి సారించి, ఇప్పటికే 7,750 నర్సింగ్ పోస్టులు భర్తీ కాగా, మరో ఏడాదోలోగా 14 వేల కొలువులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ప్రజలకు మెరగైన వైద్యం అందించడమే లక్ష్యంగా భర్తీలు చేపడుతున్నామని తెలిపారు. త్వరలోనే మరో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఇలా, వేలాది ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫకేషన్ విడుదల చేయడం దేశంలోనే తొలసారని వివరించారు.
ఇక ఇదే కార్యక్రమంలో నియామకాలు పూర్తి చేసుకొని, పత్రా కోసం వేచి చూస్తున్న 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, 23 మంది ఫుడ్ సేప్టీ అధికారులకు నియామక పత్రాలను కూడా అందజేశారు రేవంత్. ఇటీవలే, గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి పరీక్షలు రాసి, తుది ఫలితాల్లో నెగ్గిన అభ్యర్థులకు నేడు.. అంటే, డిసెంబర్ 4న నియామక పత్రాలు అందించనున్నారు సీఎం రేవంత్.
విద్యశాఖలో కొలువులకు డీఎస్సీ..
తెలంగాణ రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో ఉపాధ్యాయుల నియామకాల కోసం మెగా డీఎస్సీ నిర్వహించింది కాంగ్రెస్ సర్కార్. ఖాళీగా ఉన్న 11, 062 కొలువులను భర్తీ చేసేందుకు రాసిన డీఎస్సీ పరీక్షలో ప్రతిభ కనబర్చిన అభ్యర్థులకు కూడా నియామక పత్రాలను అందించగా, వారంతా తమకు నియమించిన పాఠశాలల్లో విద్యార్థులకు బోధనను అందిస్తున్నారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ ప్రభుత్వం తరపున మరో హామీ కూడా ఇచ్చారు. అదే, మరో డీఎస్సీ నిర్వహణ. ఇందులో మరో 6,000 పోస్టులను భర్తీ చేసేందుకు నిరుద్యోగులకు హామీ ఇచ్చారు కాంగ్రెస్ సర్కార్. దీంతో అభ్యర్థులు వారి సన్నద్ధతను మరింత మెరుగు పరిచేలా కొలసాగిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ఎప్పడైనా అమల్లోకి రావచ్చని నమ్మి, పోస్టుల భర్తీకి సిద్ధమవుతున్నారు.
హైడ్రాలో కొలువుల జాతర.. భర్తీకి..
హైదరాబాద్ లోని చెరువుల కబ్జాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రా.. అంటే, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (Hyderabad Disaster Response and Asset Protection Agency). ఈ విభాగంలో కూడా ఉద్యోగులను కేటాయించేందుకు 3,000 కొలువులకు నోటిఫికేషన్ విడుదలకు చకచకా చర్యలు చేపడుతోంది రేవంత్ సర్కార్. ఈ శాఖలో కేవలం నూతన నియామకంతో మాత్రమే కాకుండి జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ లోని ఉద్యోగుల్లో కొందరిని హైడ్రాకు బదిలీ చేయనున్నట్లు తెలస్తోంది.
మరిన్ని శాఖల్లో కూడా..
కేవలం విద్య, వైద్యా ఆరోగ్య శాఖల్లోనే కాకుండా మిగిలిన మరిన్ని శాఖల్లో ఉన్న ప్రతీ ఖాళీలకు సీఎం రేవంత్ సర్కార్ భర్తీకి సిద్దమయ్యింది. త్వరలోనే 2 లక్షల కొలువులకు భర్తీ చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు చేసిన ప్రకటనను బట్టి రాబోయే రోజుల్లో తెలంగాణలో అన్నీ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఉద్యోగాల జాతర వుంటుందని తెలుస్తోంది. వరుస ఉద్యోగ నోటిఫికేషన్ల నేపథ్యంలో నిరుద్యోగులు కూడా తమ ప్రభుత్వ కొలువుల కలను సాకారం చేసుకునేందుకు గట్టిగా కష్టపడుతున్నారు.
కేంద్రంలో కూడా భారీ నోటిఫికేషన్లు..
తెలంగాణతో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. అంటే.. రైల్వే, బ్యాకింగ్ రంగాల్లోనూ ఉద్యోగ ప్రకటనలు వెలువడుతున్నాయి. కాబట్టి నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇదే జరిగితే నిరుద్యోగులకు పండగ అనే చెప్పాలి. ఈ నోటిఫకేషన్ల వార్తలతో చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకునే అభ్యర్థులు, వివిధ శాఖల్లో పోస్టుల్లో కొలువులు సాధించే ప్రయత్నంలో మరింత మంది నిరుద్యోగులు వేచి చూస్తున్నారు.