తెలంగాణ పబ్లిక్ సర్వీర్ కమిషన్ ఇటీవలే గ్రూప్-4 తుది ఫలితాలను విడుదల చేసిన విషయం తెల్సిందే. అయితే గ్రూప్-4 ఉద్యోగంకు ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

మొత్తం 8,084 మంది అభ్యర్థులు ఈ గ్రూప్-4 ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ అభ్యర్థులకు డిసెంబర్ 4న సీఎం రేవంత్ రెడ్డి నియామకపత్రాలు అందజేయనున్నారు. అలాగే సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు సైతం అపాయింట్‌మెంట్ లెటర్లు ఇవ్వనున్నారు.
ఈ ఏడాది వ్యవధిలోనే..
గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో విఫలమైందని సీఎం రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. ఈ ఏడాది వ్యవధిలోనే 50వేల ఉద్యోగాలు భర్తీ చేసిన తొలి రాష్ట్రంగా చరిత్ర సృష్టించామన్నారు సీఎం తెలిపారు. నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగ భర్తీ చేస్తామనే నమ్మకం తమ ప్రభుత్వంపై ఏర్పడిందన్నారు