NTPC AO application window 2024 : ఎన్‌టీపీసీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. వివరాల్లోకెళ్తే..
NTPC Assistant Officer Recruitment 2024 : దేశంలోని అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC).. రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 50 సేఫ్టీ ఆఫీసర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లయ్ చేసుకోవచ్చు. అర్హత గల అభ్యర్థులు డిసెంబరు 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://ntpc.co.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
ముఖ్యమైన సమాచారం :అసిస్టెంట్ ఆఫీసర్ (సేఫ్టీ) పోస్టులు – 50అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ సివిల్/ ప్రొడక్షన్/ కెమికల్/ కన్‌స్ట్రక్షన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్)తో పాటు డిప్లొమా/ అడ్వాన్స్‌డ్ డిప్లొమా/ పీజీ డిప్లొమా (ఇండస్ట్రియల్ సేఫ్టీ) ఉత్తీర్ణులై ఉండాలి.జీతం: నెలకు రూ.30,000 – రూ.1,20,000 వరకు ఉంటుంది.గరిష్ఠ వయోపరిమితి: దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 45 ఏళ్లు దాటకుండా ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు.. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.నోటిఫికేషన్ntpc
అలాగే..ఎంపిక విధానం: విద్యార్హతలు, అప్లికేషన్ షార్ట్‌లిస్టింగ్/ స్క్రీనింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.దరఖాస్తు ఫీజు: రూ.300 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.దరఖాస్తులు ప్రారంభ తేదీ: నవంబర్ 26, 2024దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 10, 2024.