10వ తరగతి అర్హతతో.. అంగన్‌వాడీ ఉద్యోగాలు.. ఈనెల 21వ తేదీలోగా అప్లయ్‌ చేసుకోండి

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో పలు ఐటీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో అంగ్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

Anganwadi Jobs in AP : ఆంధ్రప్రదేశ్‌ నంద్యాల జిల్లాలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 68 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ శ్రీకారం చుట్టింది. ఆరు ప్రాజెక్టుల పరిధిలో మెయిన్‌ కార్యకర్తల పోస్టులు 6, మినీ కార్యకర్త 2, సహాయకులు (ఆయా) పోస్టులు 60 ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన అక్టోబర్‌ 10వ తేదీ నుంచి ఎక్కడికక్కడ సీడీపీఓలు అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకోవడం ప్రారంభమైంది. అక్టోబరు 21వ తేదీ దరఖాస్తులు సమర్పించడానికి చివరితేదీగా నిర్ణయించారు. రిజర్వేషన్‌ రోస్టర్, ఇతరాత్ర సమగ్ర వివరాల కోసం ఆన్‌లైన్‌ లేదా సంబంధిత ప్రాజెక్టు కార్యాలయం నోటీసు బోర్డులో చూసుకోవచ్చు. బనగానపల్లి, నంద్యాల అర్బన్‌, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, డోన్‌, నందికొట్కూరు ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో చూడొచ్చు.

ఇతర ముఖ్య సమాచారం :

  • అంగన్‌వాడీ వర్కర్/ మినీ అంగన్‌వాడీ వర్కర్/ అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులు: 68
  • అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. (మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు)
  • వయస్సు: 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • జీతం: నెలకు అంగన్‌వాడీ వర్కర్ పోస్టులకు రూ.11500, మినీ అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.7000, అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ.7000 ఉంటుంది.
  • దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను సంబంధిత ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్ కార్యాలయంలో అందజేయాలి.
  • దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ: అక్టోబర్‌ 10, 2024
  • దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్‌ 21, 2024

నోటిఫికేషన్‌

Anganwadi

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *