IIT Hyderabad : ఐఐటీ హైదరాబాద్‌లో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు.. విభాగాల వారీగా ఖాళీల వివరాలివే

Indian Institute of Technology Hyderabad : ఐఐటీ హైదరాబాద్‌ నాన్‌ టీచింగ్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవచ్చు.

IIT Hyderabad Non Teaching Recruitment 2024 : సంగారెడ్డి జిల్లా కందిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (IIT Hyderabad).. జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా కింది నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి Indian Institute of Technology IIT ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 31 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పోస్టులను అనుసరించి 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్‌ 10వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు పూర్తి వివరాలను https://iith.ac.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. అలాగే.. దరఖాస్తు చేసుకోవడానికి లింక్‌ ఇదే.

మొత్తం పోస్టుల సంఖ్య: 31

  • సూపరింటెండింగ్ ఇంజినీర్: 01 పోస్టు
  • పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్: 01 పోస్టు
  • టెక్నికల్ సూపరింటెండెంట్ – కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్: 01 పోస్టు
  • జూనియర్ సైకలాజికల్ కౌన్సెలర్ (మేల్‌): 01 పోస్టు
  • ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్: 03 పోస్టులు
  • ఫిజియోథెరపిస్ట్ (మేల్‌): 01 పోస్టు
  • స్టాఫ్ నర్స్: 05 పోస్టులు
  • జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్- కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్: 01 పోస్టు
  • జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్): 02 పోస్టులు
  • అకౌంటెంట్: 02 పోస్టులు
  • జూనియర్ టెక్నీషియన్ (ఏఐ/ బయోటెక్నాలజీ/ సెంట్రల్ వర్క్‌షాప్/ కెమిస్ట్రీ/ కెమికల్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సెంటర్/ డ్రాఫ్ట్స్‌మ్యాన్ సీఎండీ/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ మ్యాథమెటిక్స్/ మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్): 13 పోస్టులు

నోటిఫికేషన్‌

iith

ఇతర ముఖ్యమైన సమాచారం :

  • అర్హతలు: పోస్టులను అనుసరించి 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
  • గరిష్ఠ వయోపరిమితి: సూపరింటెండింగ్ ఇంజినీర్ పోస్టులకు 50 ఏళ్లు, పీఆర్‌వో పోస్టులకు 45 ఏళ్లు, టెక్నికల్ సూపరింటెండెంట్/ జేపీసీ పోస్టులకు 40 ఏళ్లు, ఇతర పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
  • దరఖాస్తు రుసుము: రూ. 500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
  • ఎంపిక ప్రక్రియ: రాత/ స్కిల్ టెస్ట్/ ప్రొఫిషియన్సీ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్‌ 10, 2024

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *